కంటోన్మెంట్ ను బల్దియాలో విలీనం చెయ్యండి.. లేదా బోర్డు ఎన్నికలైనా జరపండి

కంటోన్మెంట్ ను బల్దియాలో విలీనం చెయ్యండి.. లేదా బోర్డు ఎన్నికలైనా జరపండి

 

  • కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు  ఎమ్మెల్యే శ్రీగణేశ్​ విజ్ఞప్తి

 పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్​ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని, లేదా బోర్డుకు ఎన్నికలైనా నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను ఎమ్మెల్యే శ్రీగణేశ్ కోరారు. బుధవారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాజ్ నాథ్ సింగ్​కు కంటోన్మెంట్ సమస్యలపై ఆయన  వినతిపత్రం అందజేశారు. 

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పరిపాలన కుంటు పడిందని, ప్రజల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. పేద ప్రజలు నివసిస్తున్న భూములను బదలాయింపు చేసి ఆ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని కోరారు. 

అలాగే కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.వెయ్యి కోట్ల ఆర్మీ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, తద్వారా నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న బోర్డుకు జవజీవాలు అందించాలని విన్నవించారు.