డుమ్మా టీచర్లపై చర్యలు తీసుకోవాలి

 డుమ్మా టీచర్లపై చర్యలు తీసుకోవాలి

నవీపేట్, వెలుగు : రిజిస్టర్ లో సంతకాలు పెట్టి డుమ్మా కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఎంపీడీవో ఆఫీస్​లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు.  సీఎం రేవంత్​రెడ్డి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో పూర్తి చేశారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కోస్లీలో రెండు కుటుంబాలు, నాగేపూర్​లో ఒక కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున  ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెక్కులను అందజేశారు. 

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్​, గ్రంథాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజారెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో నాగనాథ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి,  నవీన్ రాజ్, నిరడి బుచ్చన్న, భగవాన్ పాల్గొన్నారు. 

ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేయండి 

బోధన్​,వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​చేయాలని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ ఎంపీడీవో ఆఫీస్​లో నియోజవర్గంలోని అన్ని శాఖల అధికారులతో అడిషనల్​ కలెకర్ అంకిత్​తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. బోధన్, బోధన్ టౌన్, సాలూర, ఎడపల్లి, రెంజల్​, నవీపేట్ మండలాల వారీగా అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయని హౌసింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సీజనల్​ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.  మురికి కాల్వలు, డ్రైనేజీల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయాలన్నారు.  ప్రభుత్వ స్కూల్స్​లో పుస్తకాలు, నోట్ బుక్​లు సకాలంలో అందించాలన్నారు. రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మార్వోలకు సూచించారు. సమీక్షలో సబ్​ కలెక్టర్​ వికాస్ మహతో, ఉర్దు అకాడమీ చైర్మన్​ తాహెర్ బిన్ హుందాన్, పీసీసీ డెలిగేట్​ గంగాశంకర్​,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.