తల్లిపాలపై అవగాహన కల్పించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

తల్లిపాలపై అవగాహన కల్పించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
  • ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​

భద్రాచలం, వెలుగు : ఆదివాసీ గిరిజన గ్రామాల్లో తల్లిపాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీవో రాహుల్​, సబ్​ కలెక్టర్​ మృణాల్​ శ్రేష్ఠ ఆఫీసర్లకు సూచించారు. సబ్​ కలెక్టర్ ఆఫీసులో గురువారం తల్లిపాల వారోత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఐసీడీఎస్​ ఆఫీసర్లు అంతా గ్రామాల్లోకి వెళ్లి తల్లిపాల విశిష్టతను వివరించాలన్నారు.

 పుట్టిన ప్రతీ బిడ్డకు మొదటి గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని గర్భిణులకు సూచించారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణులకు బాలామృతం అందించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో స్వర్ణలత, సీడీపీవో జ్యోతి, సూపర్​వైజర్లు అనసూర్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.