- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
పిట్లం, వెలుగు : వర్షాల వల్ల ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం పిట్లం, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లీ మండలాల్లో పర్యటించారు. పిట్లం మార్కెట్ యార్డు, బిచ్కుంద, జుక్కల్‌లో సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. సోయా క్వింటాల్‌కు ప్రభుత్వం రూ.5326 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు.
రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దన్నారు. అనంతరం మద్నూర్ శ్రీ కృష్ణ జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం, డోంగ్లీ మండలం ధోతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం డోంగ్లీలో రేషన్ దుకాణంలో ప్రత్యేకంగా అందిస్తున్న ఐదు కేజీల సంచులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
