
బాల్కొండ, వెలుగు: ప్రజలకు ప్రభుత్వానికి కాంగ్రెస్ కార్యకర్తలు వారధులుగా పనిచేయాలని బాల్కొండ సెగ్మెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం సెగ్మెంట్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి బాల్కొండ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతితో కలిసి ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు వెంకటేశ్‌గౌడ్, ముత్యం రెడ్డి, వేల్పూర్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొట్టింటి ముత్యం రెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.