వరంగల్ సిటీ, వెలుగు: బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. గురువారం వరంగల్ సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం చేశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతున్నాయని ఆరోపించారు. కార్పొరేటర్ నరేందర్, నాయకులు శ్రీమాన్, రాజు పాల్గొన్నారు.
