లోక్ సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశచరిత్రలోనే మహిళా రిజర్వేషన్ కోటా ఇవ్వడం అత్యంత కీలక నిర్ణయం అన్నారు. మహిళా బిల్లుతో దేశం దశాదిశా మారబోతోందన్నారు. దేశాభివృద్దిలో మహిళ భాగస్వామ్యం ఎనలేనిదన్న మోదీ.. రాజకీయాల్లో తమ శక్తిని చూపించేందుకు సిద్దం ఉన్నారని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు..చట్ట సభల్లో రిజర్వేషన్ తో నారీ శక్తి సత్తా చాటబోతున్నారని ప్రధాని అన్నారు.
మహిళా బిల్లు దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైంది.. మహిళా బిల్లును ఎన్డీయే ప్రభుత్వం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ ఎప్పుడో తేవాల్సింది. గత ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ తేవడంలో విఫలమయ్యాయన్నారు.మహిళాకోటా అమలులో ఎన్డీయే ప్రభుత్వం జాప్యం జరగనివ్వదన్నారు ప్రధాని మోదీ.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందని ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు ప్రధాని మోదీ. పంచాయతీల్లో రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు.. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత 30ఏళ్లుగా ఇదే జరుగుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీకే రాజకీయ మనుగడ ఉంటుందన్నారు మోదీ.
వికసిత్ భారత్ లో మహిళల భాగస్వామ్యం కీలకమైందన్నారు ప్రధాని . మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలు చేయొద్దన్నారు. ఎన్బీయే ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. పరిస్థితులకు అనుగుణంగా దేశంలో మార్పులు రావాలి.. బిల్లును వ్యతిరేకించిన పార్టీలను ప్రజలు క్షమించరని ప్రధాని మోదీ హెచ్చరించారు.
దేశానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యవసరమన్న మోదీ.. బిల్లుపై విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రాంతాలు, రాష్ట్రాలు అనే తేడా లేకుండా మహిళా కోటా అమలు చేస్తామన్నారు. మహిళ బిల్లుతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు ప్రధాని.
►ALSO READ | 543 సీట్ల ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయటం లేదు : ఎంపీ గౌరవ్ గగోయ్

