గుజరాత్ vs ఢిల్లీ : షమి షేక్ .. గుజరాత్ టార్గెట్ 131

గుజరాత్  vs ఢిల్లీ :    షమి షేక్ .. గుజరాత్ టార్గెట్ 131

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వార్నర్ టీమ్ కు ఆదిలోనే వరుస షాకులు తగిలాయి. షమి వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే ఫిలిప్‌ సాల్ట్ (0) డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగగా,  డేవిడ్ వార్నర్ (2) రనౌట్‌ అయ్యాడు. 

ఆ కాసేపటికే  షమీ బౌలింగ్ లో రిలీ రోసోవ్ (8), మనీష్‌ పాండే (1), ప్రియామ్‌ గార్గ్ (10)లు త్వరత్వరగానే  ఔటయ్యారు.  దీంతో 5 ఓవర్లకు  ఢిల్లీ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసి  కష్టాల్లో పడింది.  ఆ తరువాత అక్షర్‌(27), అమాన్‌ ఖాన్‌ (51) కాసేపు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డు  పెంచుతూ జాగ్రత్తగా ఆడారు.  ఈ క్రమంలో అమాన్‌ ఖాన్‌  హాఫ్ సెంచరీ కంప్లీ్ట్ చేశాడు.  చివర్లో రిపాల్ పటేల్ (23) కొంచెం ఫాస్ట్ గా ఆడటంతో  ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 130 పరుగులు చేయగలిగింది.  గుజరాత్ బౌలర్లలో షమి 4,  మోహిత్ శర్మ 2, రషీద్‌ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. 

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుంగింట విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక ఐపీఎల్‌లో గుజరాత్‌, ఢిల్లీ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌ టైటాన్సే విజయం సాధించడం విశేషం.