IND vs SA: ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్.. ప్లేయింగ్ 11 నుంచి గిల్, హర్షిత్, కుల్దీప్ ఔట్

IND vs SA: ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్.. ప్లేయింగ్ 11 నుంచి గిల్, హర్షిత్, కుల్దీప్ ఔట్

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదో టీ20 ప్రారంభమైంది. శుక్రవారం (డిసెంబర్ 19)అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నేడు జరగబోయే మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు సౌతాఫ్రికా చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 2-2 తో సమం చేయాలని భావిస్తోంది. తొలి మూడు టీ20 మ్యాచ్ లు చూసుకుంటే.. భారత జట్టుకు రెండు విజయాలు బౌలింగ్ ద్వారానే వచ్చాయి. దీంతో చివరి టీ20లో భారత జట్టు బ్యాటింగ్ పై ఫోకస్ చేయనుంది.

మూడో టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా ఐదో టీ20లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన బుమ్రా.. చివరి టీ20కి జట్టులోకి వచ్చేశాడు. హర్షిత్ రానా స్థానంలో బుమ్రా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్ టన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్ శుభమాన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సంజు శాంసన్ కు తుది జట్టులో స్థానం దక్కింది.

సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

ఇండియా ప్లేయింగ్ 11:

అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ 
 

►ALSO READ | U-19 Asia Cup: శ్రీలంకతో అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?