
మన దేశం ఆర్ధికంగా పరుగులు పెడుతుంటే జపాన్ మాత్రం వందేళ్ళు దాటినా వృద్ధుల జనాభాతో రికార్డులు కొడుతుంది. జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు ఇప్పుడు రికార్డు స్థాయిలో 95వేలు దాటారు. వీరిలో దాదాపు 90 శాతం మంది మహిళలే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఇవన్నీ అంచనాల లెక్కల ప్రకారం కాదు, ప్రభుత్వ డేటానే.
సెప్టెంబర్ 1 నాటికి జపాన్‌లో 95,119 మంది వందేళ్లు దాటినా వారు ఉండగా, గత ఏడాదితో పోలిస్తే 2,980 ఎక్కువ. వీరిలో 83,958 మంది మహిళలు, 11,161 మంది పురుషులు ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుంది. సెప్టెంబర్ 15న ఓ స్పెషల్ ప్రభుత్వ డేటా ప్రకారం చూస్తే 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 36.25 మిలియన్లతో రికార్డు స్థాయికి చేరుకుంది, ఇది జపాన్ జనాభాలో 29.3 శాతం.
వందేళ్లు నిండి లక్ష కంటే ఎక్కువ వృద్ధ జనాభా ఉన్న 200 దేశాల లిస్టులో జపాన్ అగ్రస్థానంలో ఉందని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకారం, ప్రస్తుతం జపాన్‌లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇటూకా ఉన్నారు. ఆమె 23 మే 1908న జన్మించగ, ఆమె వయస్సు ఇప్పటికి 116 సంవత్సరాలు.
టోమికో ఇటూకా పశ్చిమ జపాన్ హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియాలో ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంటున్నారు. జపాన్‌లోని అత్యంత వృద్ధుడు 110 ఏళ్ల కియోటకా మిజునో నా జీవిత రహస్యం ఏమిటో నాకు అస్సలు తెలియదు అని అక్కడి మీడియాతో చెప్పడం విశేషం. గతంలో రికార్డు సాధించిన మరియా బ్రాన్యాస్ మోరెరా 117 సంవత్సరాల వయసులో స్పెయిన్‌లో మరణించారు.
మిడ్ జపాన్‌లోని షిజుయోకా ప్రిఫెక్చర్‌లోని ఇవాటాలో కుటుంబంతో ఉంటున్న మిజునో ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు లేచి ఆహారం గురించి పెద్దగా ఆలోచించకుండా మూడు పూటలా తింటానని, సుమో రెజ్లింగ్ సహా లైవ్ స్పోర్ట్స్ వినడం అతని హాబీ అని అన్నారు.
జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుదల వైద్య & సంక్షేమ ఖర్చులకు దారితీస్తుండటంతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ మొత్తం జనాభా 124 మిలియన్లు, గత ఏడాది 595,000 తగ్గింది. ప్రభుత్వం వృద్ధుల జనాభా తగ్గించడానికి ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయింది, అయితే రిటైర్మెంట్ వయస్సు పొడిగిస్తూ 2025 ఆర్థిక సంవత్సరం నుండి అన్ని కంపెనీలలో 65 ఏళ్లుగా మారింది.