చరిత్ర సృష్టించిన రోహిత్..

చరిత్ర సృష్టించిన రోహిత్..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో  6 సిక్సులతో   చెలరేగిన రోహిత్.. ప్రపంచంలోనే  అత్యంత వేగంగా 550 సిక్సులు కొట్టిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.  రోహిత్ శర్మ 471ఇన్నింగ్సుల్లోనే  ఈ మార్క్ ను అందుకోగా.. గేల్ 548 ఇన్నింగ్సులు ఆడాడు. అటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు రోహిత్ శర్మ 551 సిక్సులు కొట్టాడు. మరో 2  సిక్సులు కొడితే గేల్(553 ) అత్యధిక సిక్సుల ప్రపంచ రికార్డ్ ను బద్దలు కొడతాడు. 

Also Read :- వరల్డ్ కప్ ముందు బ్యాడ్ న్యూస్.. మూడో వన్డేలో టీమిండియా ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 353 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 81, కోహ్లీ 56 ,శ్రేయస్ అయ్యార్ 48, జడేజా 35 రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 286 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్ 4, హెజిల్ వుడ్ 2, స్టార్క్  కమిన్స్, తన్వీర్ , గ్రీన్ తలో ఒక వికెట్ తీశారు. తొలి రెండు వన్డేల్లో  విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను 2-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది.