వరల్డ్ కప్ ముందు బ్యాడ్ న్యూస్.. మూడో వన్డేలో టీమిండియా ఓటమి

వరల్డ్ కప్ ముందు బ్యాడ్ న్యూస్.. మూడో వన్డేలో టీమిండియా ఓటమి

వరల్డ్ కప్ ముందు జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ 286 పరుగులకే కుప్పకూలింది. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్ 96, స్టీవెన్ స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులతో రాణించారు. ఒకదశలో ఆసీస్ స్కోరు 400 పరుగులు దాటుతుందని అనిపించినా.. భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి కట్టడి చేయగలిగారు. బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటగా, కుల్‌దీప్ యాదవ్ 2.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ సాధించారు.

అనంతరం 353 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 286 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 81 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ(56), శ్రేయస్ అయ్యర్(48) పర్వాలేదనిపించారు. గ్లెన్ మాక్స్‌వెల్ 4  వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 చేజిక్కించుకుంది.