నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన జరిగింది. దండెంపై ఆరేసిన బట్టలు తీస్తూ పుట్టిన రోజు నాడే ఏడు నెలల గర్భిణి విద్యుత్ షాక్తో చనిపోయింది. నర్సంపేట టౌన్లోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి ఆవరణలో ఆరవేసిన బట్టలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయింది. చనిపోయిన వివాహిత పేరు ప్రత్యూష. ఆమె ప్రస్తుతం 7నెలల గర్భిణి. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో.. ఇదే రోజు ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరెంట్ షాక్ కారణంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విషాద ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి.
స్నానానికి వేడి నీళ్లు పెట్టుకున్న ఓ మహిళ హీటర్ద్వారా కరెంట్షాక్తగిలి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వడలపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్ధిరాములు, శివలీల(40) దంపతులు మియాపూర్లోని మాధవ్నగర్కాలనీకి వలస వచ్చారు. సిద్ధిరాములు మేస్ర్తీ పనిచేస్తుండగా, స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో శివలీల వాచ్ఉమెన్గా, ఫ్లాట్లలో ఇంటి పనులు చేస్తోంది. శనివారం ఉదయం పనికి వెళ్లిన శివలీల మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు బాత్రూంలో బకెట్లో వాటర్ హీటర్పెట్టింది. వేడయ్యాక తీసే క్రమంలో కరెంట్షాక్కొట్టి స్పాట్లో చనిపోయింది.
