ఆర్మూర్ నుంచి అదిలాబాద్ కు కొత్త రైల్వేలైన్ .. ఎంపీ అర్వింద్కు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లేఖ

ఆర్మూర్ నుంచి అదిలాబాద్ కు కొత్త రైల్వేలైన్ .. ఎంపీ అర్వింద్కు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లేఖ

నిజామాబాద్, వెలుగు: ఆర్మూర్, పటన్​చెరు మీదుగా అదిలాబాద్​కు కొత్త రైల్వే లైన్​ నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లెటర్ పంపారని బుధవారం ఎంపీ అర్వింద్ మీడియాకు తెలిపారు. కొత్త రైల్వే లైన్​ ఏర్పాటు కోసం తాను సెంట్రల్​ మినిస్టర్​ అశ్విని వైష్ణవ్​ను పలుమార్లు కలిసి విన్నవించానన్నారు. 

ఈ క్రమంలో రైల్వే లైన్​ నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని వివరించారు. కొత్త రైల్వే లైన్​ మంజూరు చేసిన కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.