
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు చూస్తే మున్సిపల్ కార్పొరేటర్లా ఉందని కాం గ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం గాంధీ భవన్లో చామల మీడియాతో మాట్లాడారు.
ఓట్ చోరీ గురించి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. కరీంనగర్ టూర్లో మాట్లాడితే బండి సంజయ్ దానికి సూటిగా సమాధానం చెప్పకుండా సంబంధం లేని మాటలు మాట్లాడాడని ఆరోపించారు. పరిపక్వత లేని రాజకీయ నాయకుని తీరు సంజయ్‌లో కనిపించిందని విమర్శించారు.