దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు: గడ్డం వంశీకృష్ణ

దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు: గడ్డం వంశీకృష్ణ
  • ఉపాధి హామీ పథకం నుంచి గాంధీని తొలగించడం దారుణం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • నాడు గాడ్సే గాంధీని, నేడు మోదీ మహాత్ముడి ఆలోచనలను చంపారని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం... దేశ చరిత్రలో ఒక చీకటి రోజు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఆర్ఎస్ఎస్ అజెండాను దేశంపై బలవంతంగా రుద్దుతున్నదని ఫైర్ అయ్యారు. ‘వికసిత్ భారత్–2047’ నినాదాన్ని ప్రధాని మోదీ పదే పదే చెప్తున్నా.. గాంధీ ముక్త్ భారత్–2047 చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారని విమర్శించారు.
 

పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం బాధాకరం. చరిత్ర నుంచి ఆయన పేరును చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. 1948లో మహాత్మా గాంధీని నాతురాం గాడ్సే శారీరకంగా చంపితే, ఈ రోజు మోదీ సర్కార్ ఆయన ఆలోచనలు, పేరును చంపేసింది. ఉపాధి హామీ పథకం కోట్లాది పేదలకు జీవనాధారం. అలాంటి పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ఎంత మాత్రం సరికాదు’అని వంశీకృష్ణ విమర్శించారు. మోదీ సర్కార్ పేదల కోసం పనిచేయడం లేదని.. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నదని దుయ్యబట్టారు.