హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంతో రూ.54 కోట్ల ఆదాయం

హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంతో రూ.54 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: చందానగర్(హైదరాబాద్), కరీంనగర్​లో 5 ప్లాట్ల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ. 54.36 కోట్ల ఆదాయం వచ్చింది.  చందానగర్​లో 2,593 గజాలు, 1,809 గజాలు, 2,716 గజాల ప్లాట్లకు ఆన్​లైన్ ద్వారా అధికారులు వేలం నిర్వహిం చారు. 

వీటికి గజం రూ.40 వేలుగా అప్​సెట్ అమౌంట్​ను ఖరారు చేయగా.. వేలంలో 2 ప్లాట్లు గజం రూ.45 వేల చొప్పున, మరో ప్లాట్ రూ.40 వేల చొప్పున అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

మూడు ప్లాట్ల వేలంతో రూ. 31.13 కోట్లు ఆదాయం వచ్చినట్టు చెప్పారు. ఇక కరీంనగర్​లో 4,235 గజాలు, 3,025 గజాల ప్లాట్లకు ఆన్​లైన్​లో వేలం నిర్వహించారు. గజం రూ.30వేలు అధికారులు ఖరారు చేయగా.. రూ. 32వేలకు ఐసీఏఐ కంపెనీ, మరో ప్లాటును ప్రైవేట్ వ్యక్తి గజం రూ. 32 వేలకు కొనుగోలు చేశారని ఎండీ తెలిపారు.