ఆదిలాబాద్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..పత్తి చేనులో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..పత్తి చేనులో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఆసిఫాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సు బ్రేక్ లు ఫెయిలై పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ ​జిల్లా పరందోళి శివారులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం కెరామెరీ మండలం పరందోళి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుంది. 

పరందోళి గ్రామ శివారులోకి రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పత్తి చేనులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.