రక్షణ కమిటీలో ఉద్యోగులు భాగస్వాములు కావాలి : జీఎం ఎన్.రాధాకృష్ణ

రక్షణ కమిటీలో ఉద్యోగులు భాగస్వాములు కావాలి : జీఎం ఎన్.రాధాకృష్ణ
  • మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు రక్షణ కమిటీలో భాగస్వాములు కావాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ, రక్షణ కమిటీ కన్వీనర్, కార్పొరేట్​జీఎం(ఈఎం) ఎన్​.దామోదర్​రావు సూచించారు. సింగరేణి వార్షిక రక్షణ కమిటీ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మందమర్రి ఏరియా వర్క్​షాపును రక్షణ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ల సలహాలు, సూచనలతో యువ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ పురోగభివృద్ధికి కృషి చేయాలన్నారు. 

అంతకుముందు జీఎంలు, రక్షణ కమిటీ బృందం సభ్యులు వర్క్​షాప్​లో రక్షణ చర్యలను తనిఖీ చేశారు. ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. రక్షణ చర్యల్లో ప్రతిభ కనబర్చిన కార్మికులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం జీఎల్ ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్​ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్​భూశంకరయ్య, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి ఝూ, డీజీఎం(వర్క్​షాప్​) దూప్​సింగ్, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ----