ప్రభుత్వ స్కూళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : యూఎస్ఎఫ్ఐ

ప్రభుత్వ స్కూళ్లకు  నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : యూఎస్ఎఫ్ఐ

నస్పూర్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని భారత ఐక్యవిద్యార్థి ఫెడరేషన్(యూఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్​చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఉన్న మోడల్ స్కూల్ ను వారు సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

 అనంతరం యూఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం నాణ్యతలేదని, జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. జిల్లా అధికారులు అన్ని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు మణిచరణ్, తదితరులు పాల్గొన్నారు.