నారాయణ్ ఖేడ్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒకే ఇంటికి రెండు పదవులు దక్కాయి. భర్త సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. వార్డు సభ్యురాలిగా గెలిచిన ఆయన భార్య ఉప సర్పంచ్‌గా ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్ సర్పంచ్‌గా, ఆయన భార్య శోభ రెండో వార్డు సభ్యురాలిగా బరిలో నిలువగా.. ఇద్దరూ విజయం సాధించారు.
గురువారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. వార్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదట కొంత వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత వార్డు సభ్యులంతా కలిసి సర్పంచ్‌గా గెలిచిన విజయ్ భార్య శోభను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రెండు పదవులు ఒకే కుటుంబానికి దక్కడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
