న్యూఢిల్లీ: 2026 ఏడాది ఢిల్లీలో జరగనున్న జనవరి 26 వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా చీఫ్ గెస్టులుగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.
అలాగే, ఆ సమయంలోనే ఢిల్లీలో భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం కూడా జరగనుంది. ఈ సమిట్లో ఇరు పక్షాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) కుదుర్చుకునే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగ్రవాల్ ఇదివరకే వెల్లడించారు.
