
- కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మల్లు రవి డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. కుల గణనలో తెలంగాణ మోడల్‌ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించడం హర్షనీయమన్నారు. శనివారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ వల్లే కేంద్రం కుల గణన నిర్ణయం తీసుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణలో కుల గణన సమర్థవంతంగా పూర్తిచేశామని చెప్పారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వచ్చారని తెలిపారు. పలువురు మంత్రుల అపాయిట్మెంట్ కోరగా.. పలు పర్యటన వల్ల కుదరలేదని చెప్పారు. కాగా..ఎంపీలతో సీఎం కాసేపు మాట్లాడారు. శనివారం రాత్రి హైదరాబాద్ తిరిగి వెళ్లారు.