భారత్ లో మరో కొత్త వేరియంట్

V6 Velugu Posted on Jun 17, 2021

దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ సోకినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్య మంత్రి విశ్వస్ సారంగ్  ధ్రువీకరించారు. ఎన్‌సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) యొక్క నివేదికలో నూతన వేరియంట్ ను పేర్కొన్నట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతన వేరియంట్ కరోనా వైరస్ సోకిన మహిళ కోవిడ్ టీకా తీసుకున్నట్లు చెప్పారు. మహిళకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని.... ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

 

Tagged found, MP minister, New variant , positive case , Bhopal

Latest Videos

Subscribe Now

More News