
లింగంపేట, వెలుగు : మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని ఎంపీవో హరి సూచించారు. శనివారం మెంగారం గ్రామంలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. బేస్మెంట్వరకు పూర్తైతే రూ.లక్ష, రూప్ లెవల్ వరకు పూర్తైతే మరో లక్ష, లెంటల్ లెవల్ వరకు రూ.లక్ష, స్లాబ్ పూర్తై తే రూ. రెండు లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ సెక్రటరీ బాలమణి, సిబ్బంది దత్తు ఉన్నారు.