సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ దివాకర

సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ దివాకర

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయంలో అన్ని శాఖలతో పాటు పోలీసుల సహకారం అందడం గొప్ప విషయమని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండలం చల్వాయి తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ  బెటాలియన్ లో నూతన జిమ్, ఓపెన్ ఏరియా జిమ్ ను కమాండెంట్​కె.సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా బెటాలియన్ లో కలెక్టర్  మొక్కలు నాటి, పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ బి.సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, ఇతర బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.