గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు

ముంబై: కాపీరైట్ ఉల్లంఘన కేసులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు బుక్కైంది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు  ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. కాపీరైట్ యాక్ట్ 1957లోని 51,63,69 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలుస్తోంది. 

ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారంటూ ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. గూగుల్ సీఈఓతో పాటు అందుకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో అభ్యర్థించారు. తాను ఆ సినిమా రైట్స్ ను ఎవరికీ అమ్మలేదని, యూట్యూబ్ లో దాన్ని అప్ లోడ్ చేయడం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై యూట్యూబ్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదని అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. 2017లో రిలీజైన ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా మూవీ డిజాస్టర్ గా నిలిచింది.