
ముషీరాబాద్, వెలుగు: నృత్య గురువుల సమస్యలు పరిష్కరించాలని, వారిని కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా కమిటీ సభ్యులుగా నియమించాలని కోవిద ఆర్ట్స్ అండ్కల్చరల్ అకాడమీ అధ్యక్షురాలు పి.అనూహ్య రెడ్డి డిమాండ్ చేశారు. నృత్య గురువులందరికీ రవీంద్రభారతిలో అవకాశాలు కల్పించాలన్నారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వారి సమస్యలపై చర్చించారు.
నృత్య గురువులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం బాధాకరమన్నారు. శాస్త్రీయ సంగీత నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలని, ప్రతీ బడిలో ఒక డ్యాన్స్టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, అకాడమీ సలహాదారు పీఎన్.మూర్తి తదితరులున్నారు.