ఆకలి ఎలా తీరుస్తారో చెప్తే రూ.45 వేల కోట్లిస్తా..!

ఆకలి ఎలా తీరుస్తారో చెప్తే రూ.45 వేల కోట్లిస్తా..!

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఒకప్పుడు ‘అత్యంత ధనవంతుడు’ అనే పదానికి  అర్థం వారెన్‌‌‌‌ బఫెట్‌‌‌‌గా ఉండేది.  ప్రస్తుతం ఆ వారెన్‌‌‌‌ బఫెట్‌‌‌‌ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపద టెస్లా బాస్ ఎలన్ మస్క్ దగ్గర ఉండడం విశేషం. టెస్లా షేర్లు రాకెట్‌‌‌‌లా దూసుకుపోతుండడంతో మస్క్ సంపద కూడా  పెరుగుతూనే ఉంది. బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఎలన్ మస్క్ సంపద 335 బిలియన్ డాలర్ల(రూ.25.12 లక్షల కోట్ల) కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆయన సంపద 165 బిలియన్ డాలర్లు (రూ. 12.37 లక్షల కోట్లు) పెరగడం విశేషం. వారెన్ బఫెట్ సంపద 104 బిలియన్ డాలర్లు (రూ. 7.8 లక్షల కోట్లు) గా ఉంది. ఈ ఏడాది మే నాటికి ప్రపంచ కుబేరుడి స్థానం ఎలన్‌‌‌‌ మస్క్‌‌‌‌, జెఫ్‌‌‌‌ బెజోస్‌‌‌‌ , బెర్నాల్డ్ ఆర్నాల్ట్ మధ్య మారుతుండేది. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఈ ఇద్దరికీ అందనంత దూరంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల లిస్ట్‌‌‌‌లో 193 బిలియన్  డాలర్ల (రూ. 14.47 లక్షల కోట్ల) సంపదతో బెజోస్‌‌‌‌  రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నారు. ఆయనకు, మస్క్‌‌‌‌కు మధ్య 142 బిలియన్ డాలర్లు (రూ. 10.65 లక్షల కోట్లు) తేడా ఉండడం గమనించాలి. టెస్లా షేర్లు  కేవలం నెల రోజుల్లోనే  54.64 % పెరిగాయి. ప్రస్తుతం 1,209 డాలర్ల (రూ.90,675)  వద్ద ట్రేడవుతున్నాయి. 
టెస్లా షేరు హోల్డర్లకు పండగే..
టెస్లా షేరు హోల్డర్లు బిలియనీర్లుగా మారుతున్నారు. సింగపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రిటెయిల్ ట్రేడర్‌‌‌‌‌‌‌‌ లియో కోగన్‌‌‌‌ టెస్లాలో మూడో అతిపెద్ద ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఆయన సంపద ప్రస్తుతం 12.1 బిలియన్ డాలర్ల (రూ.90,750 కోట్ల) కు పెరిగింది. ఒరాకిల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ లారీ ఎల్లిసన్‌‌‌‌ కూడా టెస్లాలో అతిపెద్ద ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఆయనకు టెస్లా ద్వారా 18.1 బిలియన్ డాలర్ల సంపద క్రియేట్ అయ్యింది. ఆయనకు మొత్తం టెస్లా ద్వారా వచ్చిన సంపద ఒరాకిల్ ద్వారా వచ్చిన సంపదలో 25 శాతంగా ఉంది. 

బఫెట్ సంపద ఎందుకు పెరగలేదంటే..
వారెన్ బఫెట్ దానాలు ఎక్కువగా చేస్తుంటారు. ఆయన గత కొన్నేళ్ల నుంచి  ప్రతీ ఏడాది బెర్క్‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌ షేర్లలో కొంత భాగాన్ని  డొనేట్‌‌‌‌ చేస్తున్నారు. గత 16 ఏళ్లలో రూ. 3 లక్షల కోట్లను  దానం చేశారని అంచనా. బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్‌‌‌‌, ఇతర ఛారిటబుల్ ట్రస్ట్‌‌‌‌లకు పెద్ద మొత్తంలో దానం చేశారు. అందుకే మస్క్‌‌‌‌ సంపదకు, బఫెట్‌‌‌‌ సంపదకు మధ్య అంతరం ఎక్కువగా ఉంది.  
దేశంలో మస్క్‌‌ స్టార్‌‌‌‌లింక్ కంపెనీ..
ఎలన్ మస్క్‌‌కు చెందిన శాటిలైట్‌‌ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌‌‌‌లింక్‌‌ ఇండియాలో సబ్సిడరీని ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సర్వీస్‌‌లను ఇండియాలో స్టార్ట్‌‌ చేయాలని కంపెనీ ప్లాన్స్ వేస్తోంది. కాగా,  ఎలన్ మస్క్‌‌కు చెందిన రాకెట్‌‌  కంపెనీ స్పేస్‌‌ఎక్స్‌‌కు స్టార్‌‌‌‌లింక్‌‌  సబ్సిడరీ కంపెనీ. దేశంలో స్టార్‌‌‌‌లింక్ సబ్సిడరీని ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్నెట్ సర్వీస్‌‌లను అందించడానికి లైసెన్స్‌‌లు తీసుకోవడం వీలవుతుందని స్టార్‌‌‌‌లింక్ ప్రకటించింది. బ్రాడ్‌‌బ్యాండ్‌‌, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్‌‌లను ఈ కంపెనీ అందిస్తుంది. స్పేస్‌‌ఎక్స్‌‌కు దేశంలో 100 శాతం సబ్సిడరీ ఏర్పాటయ్యిందని స్టార్‌‌‌‌లింక్‌‌ ఇడియా  డైరెక్టర్‌‌‌‌ సంజయ్‌‌   భార్గవ  లింక్‌‌డిన్ పోస్టులో పేర్కొన్నారు. ‘ఇక లైసెన్స్‌‌ల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. కంపెనీ కోసం బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. భార్గవ కిందటి నెలలోనే స్టార్‌‌‌‌లింక్‌‌లో జాయిన్ అయ్యారు. ‘దేశంలో శాటిలైట్ బ్రాడ్‌‌బ్యాండ్‌‌ ఇంటర్నెట్ సర్వీస్‌‌లను, కంటెంట్ స్టోరేజ్‌‌ను, స్ట్రీమింగ్ కమ్యూనికేషన్ వంటి   టెలికమ్యూనికేషన్ సర్వీస్‌‌లను స్టార్‌‌‌‌లింక్ ఇండియా అందిస్తుంది’ అని స్టార్‌‌‌‌లింక్ ఓ ప్రకటనలో పేర్కొంది. రూరల్‌‌ ప్రాంతాల్లో స్టార్‌‌‌‌లింక్ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఢిల్లీలోని స్కూళ్లకు 100 స్టార్‌‌‌‌లింక్‌‌ డివైజ్‌‌లను ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత దేశం మొత్తం మీద ఉన్న 12 జిల్లాలలో స్టార్‌‌‌‌లింక్ డివైజ్‌‌లను ఫ్రీగా ఏర్పాటు చేస్తామంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం రెండు లక్షల డివైజ్‌‌లను దేశం మొత్తం మీద ఏర్పాటు చేయాలని స్టార్‌‌‌‌లింక్ ప్లాన్స్ వేసుకుంది. 
ఆకలి ఎలా తీరుస్తారో చెప్తే రూ.45 వేల కోట్లిస్తా..
ప్రపంచంలోని ఆకలి బాధలను యూఎన్‌‌  ఫుడ్‌‌ ఎజెన్సీ ఎలా తొలగిస్తుందో చెబితే  6 బిలియన్‌‌ డాలర్లను ఇప్పుడే దానం చేస్తానని ఎలన్‌‌ మస్క్‌‌ ట్విటర్‌‌‌‌లో పేర్కొన్నారు. మస్క్‌‌, అమెజాన్ ఫౌండర్‌‌‌‌ జెఫ్‌‌ బెజోస్‌‌లు ముందుకొచ్చి దానాలు చేస్తే ప్రపంచలోని ఆకలి భాదలను తొలగించొచ్చని   యూఎన్‌‌ వరల్డ్‌‌ ఫుడ్ ప్రోగ్రామ్‌‌  ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌‌‌ డేవిడ్  బీస్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘4.2 కోట్ల మంది ఆకలితో చనిపోకుండా ఉండడానికి  బిలియనీర్లు ముందుకొచ్చి రూ. 45 వేల కోట్ల(6 బిలియన్​ డాలర్ల)ను డొనేట్ చేయాలి. ఇదంత కష్టం కూడా కాదు’  అని బీస్లీ ట్విటర్‌‌‌‌లో పేర్కొన్నారు.  ‘ ప్రపంచంలోని ఆకలి బాధలను తొలగించడానికి 6 బిలియన్ డాలర్లను వరల్డ్‌‌ ఫుడ్ ప్రోగ్రామ్‌‌ ఎలా ఉపయోగిస్తుందో  చెబితే  ఇప్పటికిప్పుడు 6 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను అమ్మి దానం చేస్తాను’ అని మస్క్‌‌ సమాధానమిచ్చారు.  ఈ సంస్థ ఫండ్స్‌‌ను ఎలా ఖర్చు చేస్తుందో పబ్లిక్ తెలియాలని అన్నారు.