కేరళలో బయటపడ్డ రహస్య దీవి

V6 Velugu Posted on Jun 21, 2021

కేరళలో ఓ దీవి ఉన్నట్లు చెల్లనమ్ కర్షక టూరిజం గుర్తించింది. కొచ్చి అరేబియా సముద్ర గర్భంలో ఉన్న ఈ సీక్రెట్ దీవిపై గూగుల్ మ్యాప్స్ఆధారంగా పరిశోధకులు దృష్టి సారించారు. కొచ్చి తీరానికి 7కి.మి దూరంలో ఇది ఉన్నట్లు చెల్లనమ్ కర్షక టూరిజం డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షుడు జేవీఆర్ జుల్లప్పన్ తెలిపారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని తెలిపారు. 8కిలీమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి నిర్మాణాన్ని గమనిస్తున్నామని..అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ఆదేశించింది.

Tagged kerala, Island, , Google map

Latest Videos

Subscribe Now

More News