జూలై 5న బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌గా రాంచందర్ రావు బాధ్యతలు

జూలై 5న బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌గా రాంచందర్ రావు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉదయం 9 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు నాంపల్లిలోని పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 

తర్వాత 11 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు  నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, నేతలు హాజరుకానున్నారని తెలిపారు.