మత్తు పదార్థాలకు నో చెప్పండి.. ఎస్పీ శరత్ చంద్ర పవార్

మత్తు పదార్థాలకు నో చెప్పండి.. ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ, వెలుగు: మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని   ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్ , చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసినప్పుడు స్పష్టంగా “నో” అని చెప్పాలని, చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు.  అనంతరం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.   కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేశ్​, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.