
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలోని స్టూడెంట్స్కు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలంలో ఐటీడీఏ పీవో బి.రాహుల్, అన్నపురెడ్డి మండల పరిధిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్నాయక్తో పాటు ఆయా చోట్ల పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధి మాంద్యతగా నివారించి చదువుల్లో వారిలో ఏకాగ్రతను పెంచుతుందన్నారు. విద్యాశాఖ, ఏఎన్ఎం, అంగన్వాడీలు కలిసి పనిచేసి ప్రతీ స్టూడెంట్కు ఈ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. – వెలుగు, నెట్వర్క్