టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ (HONEY). కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమాజంలోని చీకటి కోణాలను, మూఢనమ్మకాలు మరియు అంధ విశ్వాసాల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను ఆవిష్కరించబోతోంది.
ఇటీవల విడుదలైన ‘హనీ’ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, తాజాగా విడుదలైన టీజర్‌తో మేకర్స్ అంచనాలను మరింత పెంచేశారు. టీజర్‌ను గమనిస్తే సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ కథ సాగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
నవీన్ చంద్ర హారర్ టోన్‌కు తగ్గ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న తన పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలకమైన సస్పెన్స్ పాత్రల్లో కనిపించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఒళ్లు గగుర్పాటు కలిగించే విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి.
ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ‘హనీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘హనీ’ ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో మరోసారి బాక్సాఫీస్ వద్ద నవీన్ చంద్ర తన సత్తా చాటుతారో లేదో చూడాలి మరి!
Silence carries the loudest fear.
— Actor Naveen Chandra (@Naveenc212) January 20, 2026
Some secrets demand silence.
Some demand sacrifice.
This Year’s Most Devastating Ritual Starts From NOW 🔥
Watch Teaser Now 👇https://t.co/rvG68XlA3G
Honey Movie - Worldwide Grand Release In Theaters From Feb 6th 🐈⬛ 🔴 @Naveenc212… pic.twitter.com/o9toWlbEqq
