చట్టాలు, వ్యవస్థ పై గౌరవం ఉండాలి : రాజా వెంకట్ రెడ్డి

చట్టాలు, వ్యవస్థ పై గౌరవం ఉండాలి :  రాజా వెంకట్ రెడ్డి

నవీపేట్, వెలుగు : చట్టాలు, వ్యవస్థ పై ప్రతి ఒక్కరికీ గౌరవం ఉండాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా నవీపేట్ లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐక్యత కోసమే శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. 

డీజే వంటివి పెట్టకుండా భజన ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులను సన్మానిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటులేకుండా పోలీస్ లింక్ లో ప్రతి మండలం లింక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో నాగనాథ్, ట్రాన్స్ కో ఏఈ పాల్గొన్నారు.