
వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు బలహీన పడుతుంది. అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంది. దీనికి వైద్యం లేదు. మెదడు వయస్సు పెరిగే విధానంలో మనం తీసుకునే ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి జీవనశైలిలో మార్పులు, ఆహారం ఎంపికలో శ్రద్ద ఒక్కటే కొంతవరకు నివారణ మార్గం అంటున్నారు డాక్టర్లు.
అల్జీమర్స్ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంలో న్యూరో సైంటిస్ట్ రాబర్ట్ WB లవ్ సెప్టెంబర్ 23న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక సూచనలు చేశారు. మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే మూడు కీలక ఆహార పదార్థాల లిస్టును చెప్పారు. అవేంటో చూద్దాం.
అధిక ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ ,అగావ్ సిరప్
ప్రాసెస్ చేయబడిన ఆహారంలో తరుచుగా వాడే పదార్థాలు అధిక ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ ,అగావ్ సిరప్లు. ఇవి వాపుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. 2018లో వెల్లడైన ఓ అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి వాపు ప్రధాన కారణంగా భావిస్తున్నారు డాక్టర్లు.
Also Read : దసరా పండుగ స్పెషల్..స్వీట్ లవర్స్ కోసం.. బాదం హల్వా
కార్న్ సిరప్ లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది. చాలా కేలరీలు ఉంటాయి. సాధారణంగా ఎక్కువ ఫైబర్ ఉండదు. ఇది ఇన్సులిన్‌ను పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతుంది. తద్వారా వాపును పెంచుతుంది-. వాపు వృద్ధాప్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కొవ్వుగా చాలా సులభంగా నిల్వ చేయబడుతుంది. కాబట్టి ఇది బరువును పెంచుతుంది అని న్యూరో సైంటిస్ట్ రాబర్ట్ అన్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్..
ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా రుచికరమైన ఆహారం..వీటిని బర్గర్‌లతో కలిపి లేదా కెచప్ లేదా మాయోతో కలిపి తింటారు. సైడ్ డిష్‌గా వాటి రుచికరమైన క్రిస్పీనెస్ ను చాలా ఇష్టంగా తింటుంటారు కొందరు. ఫ్రెంచ్ ఫ్రైస్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని న్యూరో సైంటిస్ట్ అంటున్నారు.
బంగాళాదుంపలు రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. అది మంటను పెంచుతుంది. వేయించే ఆహారాలు AGES అని పిలువబడే అధునాతన గ్లైకేషన్ ఎండ్ ఉత్పత్తులను పెంచుతాయి. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ వృద్ధాప్యాన్ని పెంచుతాయని అంటున్నారు.
సీడ్ ఆయిల్..
వంట కోసం సీడ్ ఆయిల్ ను ఉపయోగిస్తాం.. అయితే వీటి ఎంపిక చాలా ముఖ్యం అంటున్నారు. పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనె, కనోలా నూనె ,మొక్కజొన్న నూనెలు వృద్దాప్యాన్ని పెంచుతాయలంటున్నారు. ఈ నూనెలు అధిక వేడి, ప్రెజర్ తో తయారు చేస్తారు. కంటైనర్లలో ఉంచినప్పుడు సులభంగా ఆక్సీకరణం చెందుతాయి. వీటిని తింటే వాపు కలుగుతుంది. ఇవన్నీ వృద్దాప్యాన్ని పెంచుతాయని అంటున్నారు.
మరి ఏవి తింటే మెదడు వృద్దాప్యాన్ని నిలువరించవచ్చు..
అధిక ప్రోటన్లు ఉండే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, సాల్మన్, సార్డిన్లు తినడం, పుష్కలంగా నీరు, గ్రీన్ టీ , ఆర్గానిక్ కాఫీ తాగడం వంటివి వృద్దాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సాయపడుతాయని న్యూరో సైంటిస్టు రాబర్ట్సిఫార్సు చేశారు.