ఏప్రిల్ 1 నుండి కొత్త ATM రూల్స్.. బ్యాంక్ కస్టమర్లపై లిమిట్ దాటితే బాదుడే..!

 ఏప్రిల్ 1 నుండి కొత్త ATM  రూల్స్.. బ్యాంక్ కస్టమర్లపై లిమిట్ దాటితే బాదుడే..!

వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దింతో బ్యాంకులు ఏటీఎం (ATM) వాడకం సంబంధించి కొన్ని కీలక  మార్పులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఏటీఎం దగ్గర కార్డ్ లేకుండా యూపీఐ (UPI)తో స్కాన్ చేసి డబ్బు విత్ డ్రా  చేసేవాళ్లం. ఇప్పుడు దీనిపై కూడా కొత్త నిబంధనలు వచ్చాయి.... 

1. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 

 ప్రతినెల ఇచ్చే ఉచిత లావాదేవీల కోటాలోనే ఇకపై యూపీఐ విత్‌డ్రా  కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రీ లిమిట్ దాటితే, ఆ తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాకు రూ. 23 అలాగే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా HDFC బ్యాంక్ కస్టమర్లు ఎటిఎం నుండి నెలకు 5 సార్లు, ఇతర బ్యాంక్ ఎటిఎం నుండి  3 నుండి 5 సార్లు ఉచితంగా డబ్బులు విత్‌డ్రా  చేసుకోవచ్చు.

2. పంజాబ్ నేషనల్ బ్యాంక్  
పీఎన్‌బీ  డెబిట్ కార్డులపై డైలీ క్యాష్ లిమిట్ పరిమితిని మార్చింది. మీ దగ్గర ఉన్న కార్డు రకాన్ని బట్టి ఇకపై రోజుకు రూ. 50 వేల నుండి రూ. 75 వేల వరకు మాత్రమే డ్రా చేయగలరు. గతంలో రూ. 1 లక్ష వరకు ఉన్న కొన్ని కార్డుల పరిమితిని ఇప్పుడు తగ్గించారు. సేఫ్టీ కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.

►ALSO READ | 20 లీటర్ల.. డ్రింకింగ్ వాటర్ క్యాన్ రేటు పెరిగింది.. లీటర్ బాటిల్ రేటు కూడా..

3. జియో పేమెంట్స్ బ్యాంక్ 
జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది.  ఏటీఎం కార్డు లేకపోయినా, బ్యాంకింగ్ సెంటర్ల వద్ద QR Code స్కాన్ చేసి డైరెక్ట్  మీ మొబైల్ ఫోన్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బ్యాంక్ ఇచ్చే ఉచిత లావాదేవీలను ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరమైన ఛార్జీలు పడకుండా ఉండాలంటే నెలకు ఎన్నిసార్లు డబ్బులు తీస్తున్నారో గుర్తుంచుకోండి.  క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏటీఎం ఛార్జీల భారం తగ్గుతుంది.