జూలూరుపాడు,వెలుగు: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ ఏఐకేఎంఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ మొంథా తుఫాన్ వల్ల రైతులు భారీగా నష్టపోయారన్నారు.
ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వల్లోజి రమేశ్, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్ల వెంకటేశ్వర్లు, బత్తుల గోపి, నాయకులు నరేశ్, నరసింహారావు, సీతయ్య, కూరాకుల నరసింహారావు, సురేశ్, సాగర్, జీవన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
