క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్

క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
  • కొత్త కార్డు రావాలంటే ఎక్కువ స్కోర్ ఉండాల్సిందే
  • ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ డిమాండ్‌‌ చేస్తున్న బ్యాంకులు

బిజినెస్ డెస్క్, వెలుగు: ఇక నుంచి క్రెడిట్ కార్డులను పొందడం ఈజీ కాకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే గాని క్రెడిట్కార్డులను ఇష్యూ చేయకూడదని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. అన్సెక్యూర్డ్ లోన్ పోర్టుఫోలియోలో మొండిబాకీలు పేరుకుపోతుండడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కేవలం క్రెడిట్ స్కోరే కాకుండా ఇంటర్నల్ రూల్స్ పాటిస్తూ బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డులను ఇష్యూ చేస్తాయి. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ స్కోర్ 780  ఉంటే గానీ కార్డులను ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇది ముందు సగటున 700 గా ఉండేదని తెలిపారు. ఇప్పటికే క్రెడిట్ కార్డులను వాడుతున్న వారి లిమిట్ను తగ్గించాలని కూడా బ్యాంకులు చూస్తున్నాయి.  లోన్లు, ఇతర క్రెడిట్ ప్రొడక్ట్లను ఇష్యూ చేసే ముందు కస్టమర్ క్రెడిట్ స్కోర్ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కస్టమర్కు ఇచ్చే లోన్ అంత సేఫ్ అని భావిస్తాయి. 
కార్డుల వాడకం తగ్గింది..
పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్)లు, ఏటీఎంల వద్ద క్రెడిట్ కార్డులను యూజ్ చేయడం కిందటేడాది డిసెంబర్లో ఏడాది ప్రాతిపదికన 4.1 శాతం తగ్గింది. ‘ఏడాది క్రితం మాదిరిగా ఇప్పుడు తక్కువ క్రెడిట్ స్కోర్తో కార్డులు, లోన్లు తీసుకోవడం సాధ్యపడకపోవచ్చు’ అని బ్యాంక్బజార్ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంకజ్ బన్సాల్ అన్నారు. ‘కొన్ని బ్యాంకులు ముందు 700 క్రెడిట్ స్కోర్ను అడిగితే ఇప్పుడు 720 లేదా 715 వరకు పొడిగించాయి. కేవలం క్రెడిట్ స్కోరే కాకుండా ఇతర విషయాలను కూడా లెక్కలోకి తీసుకొని బ్యాంకులు క్రెడిట్ కార్డులు, ఇతర లోన్ ప్రొడక్ట్లను ఇష్యూ చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ఏవియేషన్, హాస్పిటాలిటీ వంటి కొన్ని సెక్టార్లలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్కు క్రెడిట్ కార్డులను ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు ఇష్టపడడం లేదని ఫైనాన్షియల్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులున్న వారి లిమిట్ను తగ్గించాలని చూస్తున్నాయని చెప్పారు. కరోనా సంక్షోభంతో ఈ సెక్టార్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇవి రికవరీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలని లెండర్లు చూస్తున్నారు. మరోవైపు  కరోనా టైమ్లోనూ డీఫాల్ట్ కాని కస్టమర్లకు బ్యాంకులు అదనపు రివార్డులను ఇస్తున్నాయి. వారి క్రెడిట్ లిమిట్ను పెంచుతున్నాయి. కిందటేడాది రెగ్యులర్గా క్రెడిట్ బిల్లులను చెల్లించిన కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి.
కరోనాతో మారిన పరిస్థితులు..
కరోనా తర్వాత అన్సెక్యూర్డ్ లోన్లను ఇవ్వడంపై రూల్స్ను బ్యాంకులు కఠినతరం చేశాయి. ఇదే కేటగిరీ కిందకు క్రెడిట్ కార్డులు కూడా వస్తాయి. లోన్ ఇచ్చే ముందు  బ్యాంకులు చాలా విధాలుగా రిస్క్ను లెక్కిస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇందులో మొదటిది క్రెడిట్ స్కోరేనని చెప్పారు. ‘లోన్ ఇచ్చేటప్పుడు ఉండాల్సిన క్రెడిట్ స్కోర్ ఎలిజిబిలిటీని  పెంచాము. ఈ అర్హతలను చేరుకున్న వారే కొత్త క్రెడిట్ కార్డులకు అప్లయ్ చేసుకోవాలని చెబుతున్నాం. క్రెడిట్ స్కోర్ రిక్వైర్మెంట్ను ఎంత మేర పెంచామో చెప్పడం కష్టం. ఉద్యోగి పనిచేస్తున్న ఇండస్ట్రీ బట్టి ఇందులో మార్పులున్నాయి’ అని ఓ బ్యాంకర్ పేర్కొన్నారు.  ఆర్బీఐ డేటా ప్రకారం 2019 లో  మార్చి–డిసెంబర్ మధ్య క్రెడిట్ కార్డు మొండిబాకీలు 17.5 శాతం పెరిగాయి.  కిందటేడాది  మారటోరియం కొనసాగినా  ఇదే టైమ్లో ఈ మొండిబాకీలు 4.6 శాతం పెరగడం విశేషం. మారటోరియం వలన బ్యాంకులు లోన్లను మొండిబాకీలుగా ప్రకటించలేదు.