V6 News

భారతీయ వైభవానికి పునాది కుటుంబ వ్యవస్థ

భారతీయ వైభవానికి పునాది కుటుంబ వ్యవస్థ

వర్ధన్నపేట, వెలుగు: కుటుంబ వ్యవస్థే భారతీయ వైభవానికి పట్టుకొమ్మ అని, సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులు కంకణం కట్టుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట భారతీయ నాటక కళా సమితిలో ఆదివారం హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి విజయ భారతితోపాటు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీకాంత శర్మ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది కరుణా సాగర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ వైభవానికి పునాదిగా నిలిచిన కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ వివిధ రూపాల్లో హిందూత్వంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు హిందూ ధర్మ సమ్మేళనంలో భాగంగా వేద పండితుడు కలకోట గోపాలాచార్యులు ఆధ్వర్యంలో మహాలక్ష్మి యాగం చేపట్టారు. అనంతరం మున్సిపాలిటీలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్​ సభ్యురాలు విజయ భారతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. భోజనం, వసతులపై ఆరా తీశారు.