- 560 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి
- 2 నెలల పాటు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్
మెహిదీపట్నం, వెలుగు: తక్కువ బరువుతో పుట్టిన పాపకు నీలోఫర్ ఆస్పత్రి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించి కాపాడారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముస్కాన్ భార్య రిజ్వాన్ రెండు నెలల కిందట 7 నెలలకే ప్రసవించగా.. చిన్నారి560 గ్రాముల బరువుతో జన్మించింది. నెలలు నిండకముందే పుట్టడంతో చిన్నారిని నీలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా.. 2 నెలల పాటు డాక్టర్ల టీమ్ అబ్జర్వేషన్ లో ఉంచి ట్రీట్ మెంట్ చేసింది. దీంతో పాప1 కిలో 465 గ్రాముల బరువు పెరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బుధవారం డిశ్చార్జ్ చేశారు. చిన్నారికి ట్రీట్ మెంట్ చేసి కాపాడిన డాక్టర్లు స్వప్న, అలివేలు, సురేష్ తో పాటు జూనియర్ డాక్టర్లను ఆస్పత్రి సూపరింటెండెంట్ టి. ఉషారాణి అభినందించారు.
