‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్

 ‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్. వచ్చినవి కాకుండా నచ్చిన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. 

ప్రస్తుతం ధనుష్​ 50వ సినిమాతో పాటు ఓ మలయాళ  చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే  మరో కొత్త కథతో త్వరలోనే  ఓటీటీ ద్వారా  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.  శ్రీనివాస్ అవసరాల కథను అందించగా, గోమటేష్ ఉపాధ్యాయు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌‌గా ఈ సిరీస్ మోషన్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ‘అబ్దుల్ కలాం అంట.. రజినీకాంత్ అంట.. తర్వాత ఈవిడే నంట.. ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తాదంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోదట’ అంటూ  నిత్యా మీనన్ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం  చేయడంతో వెబ్ సిరీస్‌‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ‘కుమారి శ్రీమతి’ పాత్రలో నిత్యా మీనన్ కనిపించనుంది.