జార్ఖండ్లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు : మంత్రి నితిన్ గడ్కరీ

జార్ఖండ్లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు : మంత్రి నితిన్ గడ్కరీ
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

గర్వా: జార్ఖండ్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం గర్వాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జార్ఖండ్ లో ఇన్ఫాస్ట్రక్చర్ ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను అమలు చేయనున్నామని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను పూర్తి చేశాం. 

ఇప్పుడు రూ.70 వేల కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. రూ.75వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. రూ.36 వేల కోట్లతో నిర్మించనున్న వారణాసి–-రాంచీ–-కోల్‌‌‌‌‌‌‌‌కతా గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ కారిడార్ మార్చి 2028 నాటికి పూర్తవుతుంది.