కెమికల్ చాయ్ లు డేంజర్

కెమికల్ చాయ్ లు డేంజర్

గ్రీన్ టీ, బ్లాక్ టీ, కోవిడ్ టీ, డాక్టర్ టీ, కరోనా టీ, లెమన్ టీ, హానీ టీ, వామ్ వాటర్ విత్ హానీ టీ, జాస్మిన్ టీ, రోస్ టీ, బాదాం టీ, జింజర్ టీ..... ఇలాంటి రక రకాల టీలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో దొరుకుతున్నాయి. నగరంలో టీ పాయింట్ల పేరుతో వందకు పైగా చాయ్ దుకాణాలు వెలిసాయి.  టీ షాప్ కి వెళ్ళగానే పెద్ద లిస్టే కనిపిస్తోంది. 20 రకాల చాయ్ లు ఈ జాబితాలో ఉంటున్నాయి. కరోనా వైరస్ వచ్చాక వేడి పదార్థాలు తీసుకోవాలని...  కషాయాలు, టీల మీద కాన్సస్ట్రేట్ చేస్తున్నారు జనం. 
                
కోవిడ్ నియంత్రించడానికి  వేడి వేడి రసాలు పని చేస్తాయని యూట్యూబ్ ల్లో, వెబ్ పేజీల్లో చదువుతున్న జనం... మార్కెట్లో దొరికే రకరకాల చాయ్ లకు అలవాటు పడుతున్నారు.  ఈ వెరైటీ చాయ్ లు ఇంట్లో చేసుకోవటం అంత ఈజీ కాదు. సాధారణ టీ పెట్టుకోవాలంటే ఇంట్లో పాలు, చాయ్ పత్తా రెడీగా ఉంటాయి. ఇక జలుబు చేసినప్పుడు ఆ  చాయ్ లో కాసింత అల్లం, మిరియాలు వేసి బాగా కాచి తాగుతాం. కానీ ఇప్పుడు టీ దుకాణాల్లో దొరికే వెరైటీ చాయ్ ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అయినా సరే.... జనం ఇష్టంగా తాగుతున్నారు.  సాధారణ చాయ్ రూ.5 నుంచి ఏడు రూపాయలకు దొరుకుతుంది.  కానీ ఈ స్పెషల్ టీల ధరలు మాత్రం 20 రూపాయలకు పైగా ఉంటున్నాయి. 

కరోనా తర్వాత జనం రక రకాల టీలు తాగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. అందుకే  తాము కూడా వెరైటీ ఫ్లేవర్లను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. టీల ధరలు ఎక్కువైనా సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. వేడి నీళ్ళు మరిగించి అందులో రకరకాల ఫ్లేవర్స్ కలిపితే ఈ వెరైటీ చాయ్ లు తయారవుతున్నాయి. అయితే వీటి నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. ఫ్లేవర్స్ ని కెమికల్స్ తో తయారు చేస్తారనీ... వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని సూచిస్తున్నారు.  ఇంట్లో చేసుకున్న టీయే బెటర్ అని చెబుతున్నారు. హెర్బల్ టీ లు, ఫ్లేవర్ టీ లతో కోవిడ్ నియంత్రణ సాధ్యం  కాదంటున్నారు డాక్టర్లు.  కెమికల్స్ తో తయారయ్యే ఛాయ్ లు తాగడం వల్ల లేని పోని రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

 

 

READE MORE NEW

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది

రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు