రూ.20 కోట్ల విలువ సర్కార్​ ల్యాండ్​ కబ్జా

రూ.20 కోట్ల విలువ సర్కార్​ ల్యాండ్​ కబ్జా

నిజామాబాద్​, వెలుగు : నగర శివార్​లోని సారంగపూర్​ వద్ద సర్వే నంబర్​ 231లోని సర్కార్ ల్యాండ్​ ఆక్రమించి వెంచర్​ వేస్తున్నారని మజ్లిస్​ పార్టీ జిల్లా  ప్రెసిడెండ్​ ఫయాజ్​ తెలిపారు. రూ.20 కోట్ల విలువ గల భూకబ్జా ఆపాలని కలెక్టర్ రాజీవ్​గాంధీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మాజీ కార్పొరేటర్​ ఆధ్వర్యంలో ఆక్రమణ మొదలైందని చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవో ద్వారా ఎన్​క్వయిరీ చేయిస్తానని భరోసా ఇచ్చారు.