సిబిల్ స్కోర్ లేదా.. ఎలాంటి షూరిటీ లేకుండా 50వేల వరకు లోన్.. ఈ పథకం మీకోసమే...

సిబిల్ స్కోర్ లేదా.. ఎలాంటి షూరిటీ లేకుండా 50వేల వరకు లోన్.. ఈ పథకం మీకోసమే...

ప్రతిరోజు జీవనోపాధి పొందే లక్షలాది మంది గిగ్ కార్మికులకు ప్రభుత్వం పెద్ద రిలీఫ్ ఇవ్వబోతుంది. మీకు పర్మనెంట్ ఉద్యోగం, జీతం స్లిప్ లేదా  CIBIL స్కోరు లేదని బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదా ?  అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్తగా మైక్రోక్రెడిట్ పథకాన్ని తీసుకురాబోతుంది, ఈ పథకం కింద షూరిటీ/గ్యారంటీ  లేకుండా రూ.10వేల వరకు లోన్ పొందోచ్చు.......

కొత్త మైక్రో క్రెడిట్ పథకం ఎప్పటి నుండి అంటే : సమాచారం ప్రకారం, ఈ పథకాన్ని ఏప్రిల్ నుండి అమలు చేయవచ్చు. దీనిని  కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ కార్మికులు, ఇంట్లోనే పని చేసే వారు సహా   ఇతర ఆన్ క్యాటగిరైజెడ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ఉద్దేశం. అర్హత ఉన్న వారికీ  ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేల నుండి మైక్రోలోన్‌లను ఇస్తుంది.  దింతో వారి పనికి సంబంధించిన వస్తువులను  కొనుక్కోవచ్చు లేదా ఏదైన కొత్తగా స్టార్ట్ చేయవచ్చు.

ఈ కొత్త పథకం ప్రధాన మంత్రి వీధి విక్రేతల(strret vendors) ఆత్మనిర్భర్ నిధి (PM-SVANidhi) పథకం లాగే ఉంటుంది. PM-SVANidhi కింద  మొదట 10,000 వరకు లోన్,  తరువాత 20,000 వరకు ఇలా టైంకి లోన్ తిరిగి చెల్లిస్తే  50,000 వరకు లోన్ అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇందులో మరో  ప్రయోజనం ఏంటంటే వడ్డీకి సబ్సిడీ కూడా ఉంటుంది.

Also Read : నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.

ప్రభుత్వ రికార్డులలో  రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందుతారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న గిగ్ కార్మికులు, ఇంట్లో పనులు చేసే వారు ఇతర ఆన్ క్యాటగిరైజెడ్ కార్మికులు ఈ రుణానికి అర్హులు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇంకా  ఆధార్  ఉండి... ఈ-శ్రమ్ (e-Shram) పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకుని ఉన్నవాళ్ళకి ముందుగా ప్రాధాన్యత ఉంటుంది.

ఆదాయ రుజువు(income proof) లేదా క్రెడిట్ హిస్టరీ లేకపోవడం వల్లే చాలా మంది గిగ్ కార్మికులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త పథకం ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఇంకా  స్వావలంబన చెందడానికి సహాయపడుతుంది.

నవంబర్ 2025 నాటికి లక్షల మందికి పైగా  గిగ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ పథకం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా లక్షలాది మంది  ఆర్థిక మౌలిక సదుపాయాలతో కనెక్ట్ అవ్వడానికి మార్గం తెరుస్తుంది.