మిజోరం బరిలో 174 మంది అభ్యర్థులు

మిజోరం బరిలో  174 మంది అభ్యర్థులు

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే  అభ్యర్థుల వివరాలను ఈసీ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం  174మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఇందులో 16 మంది మహిళలు సైతం ఉన్నారు.  ఐదు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో దించగా.. 27మంది స్వతంత్రులు సైతం పోటీలో ఉన్నట్లు వెల్లడించారు.  

అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రధాన ప్రతిపక్షం ZPM,  కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.   బీజేపీ 23 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఏడాది నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 38 తక్కువగా ఉంది. 

Also Read :- దంచికొడుతున్న ఆఫ్ఘన్ ఓపెనర్లు

కాగా రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు 2023 నవంబర్ 7న  మిజోరంలో  ఒకే దశలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.   డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో  మొత్తం 8,56,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.