చక్కెర, బ్రెడ్ కాదు! అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్‌పై ఢిల్లీ డాక్టర్ హెచ్చరిక..

 చక్కెర, బ్రెడ్ కాదు! అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్‌పై ఢిల్లీ డాక్టర్ హెచ్చరిక..

ఢిల్లీలోని ఆర్థో & స్పోర్ట్స్ సర్జన్ అయిన డాక్టర్ ఒబైదుర్ రెహమాన్ ఇచ్చిన హెచ్చరిక ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ప్రకారం, మనం రోజూ తెలియకుండా తినే ఒక సాధారణ పదార్థం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్ అని పేర్కొన్నారు.

డాక్టర్ రెహమాన్ దృష్టిలో ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్ ఏంటంటే... ఇండస్ట్రియల్ స్టార్చ్ (పారిశ్రామిక పిండి పదార్థం). దీన్ని మైక్రో డెక్స్‌ట్రిన్ లేదా కార్న్ స్టార్చ్ అని కూడా అంటారు. యువకులలో, చురుకైన వారిలో సైతం పెరుగుతున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ప్రధాన కారణం అని ఆయన అంటున్నారు.

డాక్టర్ రెహమాన్ ప్రకారం, అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్ చక్కెర, బ్రెడ్ లేదా బియ్యం కాదు. ఎందుకంటే  ఈ ఇండస్ట్రియల్ స్టార్చ్ రక్తం గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది. ఇది కేవలం కొన్ని గంటల్లోనే రక్తంలో చక్కెరను డెసిలీటర్‌కు 200 నుండి 250 మిల్లీగ్రాముల వరకు పెంచగలదు.

ఇలాంటి గ్లూకోజ్ పెరుగుదలలు పదేపదే జరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. ఈ హాని కేవలం రక్తంలో చక్కెర నియంత్రణకే పరిమితం కాదు. డాక్టర్ రెహమాన్ దీని ఇతర ప్రమాదాలను కూడా వివరించారు. ఇది మీ కాలేయంలో కొవ్వును నిల్వ చేస్తుంది, దీనివల్ల కొవ్వు కాలేయం(fatty liver) సమస్య పెరుగుతుంది. ఇంకా మీ కీళ్లలో కూడా వాపుకు కూడా కారణమవుతుంది. 

 ఇండస్ట్రియల్ స్టార్చ్ చాలా చౌకగా ఉండటం, ప్యాక్ చేసిన ఆహారాలలో సులభంగా కలపడం వల్ల, దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. సూప్‌లు, సాస్‌లు, చిప్స్, వేయించిన స్నాక్స్, బేకరీ బిస్కెట్లు, కేకులు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు, ఈ పదార్థాన్ని కావాలని కాకుండా, తెలియక లేదా సౌలభ్యం కోసమే ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారని డాక్టర్ రెహమాన్  చెప్పారు. డాక్టర్ ఒబైదుర్ రెహమాన్ ఈ లైఫ్ స్టయిల్  వ్యాధుల గురించి అవగాహన కల్పించడంలో ఫెమస్.  ఆయన చెప్తున్నది ఏంటంటే అవగాహన మన వంటగది నుంచే మొదలు కావాలి.