
భారతదేశంలో ఖనిజాల వెలికితీత వేగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 'మైనింగ్ అండ్ మినరల్స్ (Development and Regulation) చట్టం'లో ఆరు కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు దేశంలో ఖనిజ వనరులను వేగంగా వెలికితీయడానికి, ఖనిజాల అన్వేషణ సులభం చేయడానికి ఉద్దేశించినవి. దింతో రాజస్థాన్ వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ఆరు మార్పులపై కేంద్ర గనుల మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ లిథియం వంటి ఖనిజాల కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్నాము. ఈ మార్పులు ఖనిజాలు ఉన్న సంపన్న రాష్ట్రాలకు రాయల్టీ, ఉపాధి రెండింటినీ అందిస్తాయని అన్నారు.
కేంద్రం చేసిన 6 మార్పులు:
*ప్రస్తుతం ఉన్న గనుల లీజుదారులు లిథియం, బంగారం, వెండి, నికెల్, బొగ్గు వంటి ఖనిజాల వెతికితీతను లీజులోకి చేర్చుకోవచ్చు. చాలా సందర్భాల్లో దీనికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు.
*ఇసుక, కంకర, రాళ్ళు వంటి చిన్న ఖనిజాలపై రాయల్టీని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.
* నేషనల్ మినరల్స్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (NMET) రాబోయే ఐదేళ్ళలో అన్వేషణ, అభివృద్ధి కోసం రూ. 8,700 కోట్లు ఖర్చు చేస్తుంది.
*200 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న ఖనిజాల తవ్వకం కోసం లీజు ప్రాంతాన్ని పెంచుకునేందుకు అనుమతి లభిస్తుంది.
*ఖనిజాలు, లోహాల వ్యాపారం కోసం ఒక రిజిస్టర్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తుంది.
*వేలం వేసిన గనులకు కొత్త ఖనిజాలను చేర్చాలంటే అదనపు వేలం ప్రీమియం చెల్లించాలి.
రాజస్థాన్ ఎలా ప్రయోజనం పొందుతుంది: ప్రముఖ ఖనిజాలతో పాటు రాజస్థాన్ నేలలో బంగారం, వెండి, టంగ్‌స్టన్, లిగ్నైట్ నుండి అరుదైన మట్టి వరకు చాల అమూల్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. రెండు బంగారు గనులు ఇప్పటికే వేలం వేయగా ఇంకా చాలా గనులు వేలం వేయాల్సి ఉంది. అరుదైన భూమి మూలకాల కోసం అన్వేషణ కొనసాగుతోంది, కేంద్రం చేసిన ఈ మార్పులు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. రాజస్థాన్ రాష్ట్రంలో దాదాపు 82 రకాల ఖనిజాలు ఉన్నాయి, వాటిలో 52 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి మార్గం తెరిచింది, ఇది రాయల్టీ అలాగే ఉపాధి రెండింటినీ పెంచుతుంది.
రాజస్థాన్ ఓ ఖనిజ సంపద:
అమూల్యమైన ఖనిజాలు: రాజస్థాన్‌లో బంగారం, వెండి, లిగ్నైట్, టంగ్‌స్టన్, గ్రానైట్, జిప్సం, బెంటోనైట్ వంటివి లభిస్తాయి.
అరుదైన భూ ఖనిజాలు: ఈ ఖనిజాల కోసం ఇప్పటికే అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే వీటిని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర ఖనిజాలు: రాగి, జింక్, ఫాస్ఫోరైట్, లైమ్ స్టోన్ వంటి ఎన్నో పారిశ్రామిక ఖనిజాలు కూడా ఇక్కడ చాల ఉన్నాయి.
నిబంధనల సవరణ ద్వారా రాజస్థాన్ ప్రయోజనం: రాజస్థాన్‌లో బంగారం, వెండి వంటి ప్రముఖ ఖనిజాలు చాలా ఉన్నాయి, వీటిని అమూల్యమైన ఖనిజాలలో చేర్చారు. నిబంధనలలో సవరణతో రాజస్థాన్ కూడా కొంత ప్రయోజనం పొందోచ్చు. అయితే రాజస్థాన్‌లో ఇప్పటికే రెండు బంగారు గనులు వేలం జరిగాయి. ఇతర గనులు కూడా వేలం వేయనుంది. ఈ కీలకమైన ఖనిజాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది.
ఖనిజాలను అన్వేషించడానికి ఒక కంపెనీ: రాబోయే కాలంలో ఖనిజాల గనులను కూడా వేలం వేస్తారు. ఇందుకు రాష్ట్రంలో అరుదైన భూమి ఖనిజాల అన్వేషణ కోసం పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇంకా బయట పడని ఖనిజాలు చాల ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అన్వేషణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా రాజస్థాన్ ఖనిజాల అన్వేషణలో ప్రయోజనం పొందుతుంది.