
బాల్కొండ, వెలుగు : ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో సీఎం నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
సమగ్ర ఎన్నారై పాలసీతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తోందని కమిటీ చైర్మన్, డా.బీఎం వినోద్ కుమార్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిల్ ఈరవత్రి పేర్కొన్నారు. వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్, చెన్నమనేని శ్రీనివాసరావు, గుగ్గుళ్ల రవి గౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.